నిర్భయ అత్యాచారం కేసులో నిందితులకు ఈ మధ్య ఉరిశిక్ష అమలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా ఓ ఆసక్తికరమైన స్టేట్‌మెంట్ ఇచ్చింది. నిర్భయ నిందితులకు విగ్రహాలు కట్టించాలని చెప్పింది. అదేంటీ, గొప్ప పనులు చేసిన వారికే కదా.. విగ్రహాలు కడతారు. పైశాచికత్వం నిండిన ఇలాంటి వ్యక్తులకు ఎందుకు విగ్రహాలు పెట్టించాలంటోంది.? కంగనాకేమైనా పిచ్చి గానీ పట్టిందా.? అని కొందరు వాపోతున్నారు. అయితే, ఇలాంటి ఘోరాలు, నేరాలు భవిష్యత్‌లో మరెవ్వరూ చేయకుండా ఉండాలనే స్పూర్తితోనే వీరికి విగ్రహాలు పెట్టించాలని కంగనా మాటల సారాంశమంటున్నారు ఇంకొందరు.
అయితే, కంగనా ఒపీనియన్ ఏంటంటే, ఉరి తీసినప్పటి నిందితుల విగ్రహాను పెట్టించాలనట.. అవి చూసినప్పుడు మళ్లీ అలాంటి ఆలోచన చేయాలంటేనే భయం కలగాని కంగనా ఉద్ధేశ్యమట. కంగనా ఉద్దేశ్యాన్ని తప్పుపడుతున్నారంటూ ఆమె సిస్టిర్ రంగోలీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోందట. ఏమో ఏది ఏమైనా ప్రపంచమంతా కరోనాతో కకావికలమైపోతున్న పరిస్థితి ముందు, ఒకప్పుడు దేశం ఉలిక్కిపడేలా సంచలనమైన ఈ నిర్భయ హత్య కేసు నిందితుల ఉరిశిక్ష కూడా చిన్నదైపోయింది.