హారర్ చిత్రాల కి మంచి మార్కెట్ నడుస్తున్నతరుణంలో నటీమణులంతా ఆ ట్రెండ్ వైపుకి మొగ్గుచూపుతున్నారు.
ఇక అలా ఆ ట్రెండ్ లో కొత్తగా వెళ్ళనున్న హీరోయిన్ కాజల్. వివరాల్లోకి వెళితే, కాజల్ ముందుకి ఒక హారర్ కథ వచ్చిందట, ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసిందట. ఈ చిత్రం తెలుగు, తమిళ బాషలలో ఒకేసారి నిర్మాణం కానుందట.
అయితే ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ తో ఏంఎల్ఏ చిత్రంలో నటిస్తుండగా, రానా తో చేసిన నేనే రాజు నేనే మంత్రి విడుదలకి సిద్ధంగా ఉంది.
గుడ్ లక్ కాజల్.