అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఓ అరుదైన ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోందని తెలుస్తోంది.
దర్శకుడు భార్గవ్ ఓ అరుదైన కాన్సెప్ట్‌తో స్క్రిప్టు ప్రిపేర్ చేశాడట. రామాయణంలో సూర్పణక పాత్రని బేస్ చేసుకుని రాసిన ఈ స్క్రిప్టులో సూర్పణక పాత్రకు కాజల్‌ని ఊహించుకున్నారట ఆయన. సూర్పణక అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. కానీ ఆ పాత్రలో మనకు తెలియని చాలా షేడ్స్‌ని ఈ సినిమా ద్వారా భార్గవ్ చూపించనున్నాడట.
రామునిపై మోహించిన సూర్పణక, లక్ష్మణునిచే ముక్కులు, చెవులు కోయించుకుని, అన్న రావణున్ని రెచ్చగొట్టి, సీతను ఎత్తుకొచ్చేలా చేసి, రామ రావణ యుద్ధానికి ప్రధమ కారకురాలుగా రామాయణంలో సూర్పణక పాత్రను చెప్పుకుంటాం. కానీ మన భార్గవ్ రాసిన స్క్రిప్టులో ఆ పాత్ర తాలూకు థీమ్‌ని మాత్రమే తీసుకుని, ఇంతవరకూ ఎవ్వరూ ఊహించని కాన్సెప్ట్‌ని జత చేసి, అద్భుతమైన సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమాని రూపొందించనున్నారట. ఈ పాత్రకు కాజల్ అయితే చాలా బాగుంటుందనీ ఆయన భావిస్తున్నారట.
ఆల్రెడీ కాజల్‌కి స్టోరీ లైన్ వినిపించారట. ప్రస్తుతం డిఫరెంట్ పాత్రలను ఎంచుకొనే యోచనలో ఉన్న కాజల్‌కి ఈ స్క్రిప్టు బాగా నచ్చిందని తెలుస్తోంది. తొలిసారి ఈ తరహా ప్రయోగంలో భాగమవుతున్న కాజల్, సెకండ్ ఒపీనియన్ తీసుకుని త్వరలోనే ఈ స్క్రిప్టు ఓకే చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే కాజల్ తనలోని నటిని ఛాలెంజ్ చేస్తున్నట్లే ఈ పాత్రతో. ప్రస్తుతం తమిళంలో బాలీవుడ్ 'క్వీన్' రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్'లో కాజల్ నటిస్తోంది.