జలకాలాటంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. అయితే మన అందాల భామలు జలకాలాట అంటే, స్విమ్మింగ్ పూల్. అందులో బికినీ కాస్ట్యూమ్.. హాట్ హాట్ సొగసులు. కానీ, చందమామ ఏం చేసిందో తెలుసా.? పూల్‌లో బికినీతో స్విమ్మింగ్ చేయలేదు.
కానీ, చిన్నప్పుడు మనమందరం సరదాగా ఆడుకునే జలకాలాటల్ని తలపించేలా ఇదిగో ఇలా ఆడుకుంటోంది. చూశారుగా.. ఈ పిక్ చూస్తుంటే, మనకీ మన ఛైల్డ్ హుడ్ డేస్ గుర్తొచ్చేశాయ్ కదా. బికినీలో ఆడితే ఏముంది మజా. ఇదిగో ఇలా ఆడితేనే అసలు మజా అంటోంది చందమామ.
ఇక ఈ కొత్త రకం ఆటకి మన చందమామ ధరించిన డ్రస్సును పరిగణనలోనికి తీసుకోవాల్సిందేనండోయ్. వైట్ అండ్ వైట్ మోడ్రన్ డ్రస్. సింగిల్ పీస్‌లోనే ఉంది. కానీ, అక్కడక్కడా పెట్టిన కట్స్ చూశారుగా, డ్రస్‌కి మోడ్రన్ లుక్‌తో పాటు, చందమామకు గ్లామర్‌కి అదనపు వన్నెలు అద్దుతోంది.
క్లీవేజ్‌కి పైనా, కిందా ఉన్న ఈ కట్స్‌లో చందమామ ఇస్టైల్ ఇస్మార్ట్‌హెే.! ప్రస్తుతం కాజల్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, 'రణరంగం' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళంలో 'క్వీన్' రీమేక్ చిత్రం కూడా విడుదలకు సిద్ధమైంది. 'కోమలి' అనే కొత్త చిత్రం నిర్మాణంలో ఉంది. దీంతో పాటు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'ఇండియన్ 2' కూడా కాజల్ ఖాతాలో ఉంది.