కితకితలు పెట్టిస్తానంటోన్న తెలుగమ్మాయ్‌!

మరిన్ని వార్తలు

పదహారణాల తెలుగమ్మాయ్‌ అంజలి తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ టైప్‌ పాత్రలతో పాటు, కొన్ని స్పెషల్‌ సాంగ్స్‌లోనూ సత్తా చాటింది అంజలి అక్కడ. 'బెలూన్‌', 'లిసా' తదితర హారర్‌, థ్రిల్లర్‌ టైప్‌ సినిమాలనూ టచ్‌ చేసింది. ఇక ఇప్పుడు కామెడీ జోనర్‌ ట్రై చేయబోతోందట. కామెడీ అంటే, అలాంటిలాంటి కామెడీ కాదంటున్నారు. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ జోనర్‌ అట.

 

ధియేటర్స్‌లో ఫుల్‌గా నవ్వులు పూయించనుందట అంజలి తన పాత్రతో. ఇదో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ అంటున్నారు. కృష్ణన్‌ జయరాజ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆ మాటికొస్తే అంజలికి కామెడీ టచ్‌ లేదని కాదు కానీ, ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ కనిపించని పాత్రలో అంజలి కనిపించనుందట. దీంతో పాటు, లేటెస్ట్‌గా తెలుగులోనూ ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌కి అంజలి సైన్‌ చేసిందని సమాచారమ్‌.

 

ఓ ప్రముఖ డైరెక్టర్‌ తన సినిమాలో కీలక పాత్ర కోసం అంజలితో సంప్రదింపులు జరుపుతున్నాడట. త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌ ఓ కొలిక్కి రానుందట. మరోవైపు అంజలి 'సైలెన్స్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, మాధవన్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. అంజలితో పాటు మరో ముద్దుగుమ్మ షాలినీ పాండే కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS