చందమామ కాజల్ అగర్వాల్‌ని అభిమానులు ముద్దుగా కాజు పాప అని పిలుచుకుంటున్నారు. పదేళ్లకు పైగానే తన గ్లామర్‌తో తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న అందాల రాణి కాజల్. సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ ఇలా కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసేసింది. కానీ క్రేజ్ మాత్రం ఒకేలా ఉంది. ఒకేలా ఉంది అనే కన్నా, సీనియర్ అయినాక ఆ క్రేజ్ ఇంకా పెరిగిపోయిందని చెప్పాలి. ఈ మధ్య కాజల్ అంటే తెగ పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు. అదే పిచ్చిని ఇన్ టైంలో కరెక్ట్‌గా వాడేసుకుంటోంది మన చందమామ.
సోషల్ మీడియాలో ఇంతకు ముందెన్నడూ లేనంత యాక్టివ్‌గా కనిపిస్తోంది. స్పెషల్‌గా హాట్ హాట్ ఫోటో సెషన్స్ చేయించుకుని, సీనియర్ అందాలకు మరింత మెరుపులు అద్దేస్తోంది. దాంతో కుర్రకారు కాజల్ నామజపమే చేసేంతగా వారి హృదయాల్ని కొల్లగొట్టేస్తోంది. చూస్తున్నారుగా ఈ తాజా పిక్. అల్ట్రా మోడ్రన్ వేర్ కాస్ట్యూమ్‌లో చందమామ సిగ్గులొలికే గ్లామర్ కెవ్వుకేక పెట్టించేయట్లా.!