ఈ దాహం తీరనిది అనే రేంజ్‌లో చందమామ అందాల ఆరబోత ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. సీనియర్ హీరోయిన్ అయినా అవకాశాల జోరు తగ్గకపోవడంతో ఇంకా ఇంకా తనలోని గ్లామర్ న్యూ యాంగిల్స్‌ని బయట పెట్టాలనే తపన బాగా ఎక్కువైపోయింది కాజల్‌కి. దాంతో సోషల్ మీడియాలో ఈ మధ్య హాట్ హాట్ పిక్స్‌తో తెగ హీటు పుట్టించేస్తోంది.
అయితే అతి సర్వత్రా వర్జ్యయేత్ కదా. ఆ తాపతయ్రంలో కాజల్ హద్దులు మీరుతోన్న కారణంగా అక్కడక్కడా తన వయసు బయట పడిపోతోందంటూ చాలా కొద్దిమంది నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. అసలు కాజల్ ఎందుకిలా చేస్తోంది.? అనే మాట పక్కన పెడితే, ఏమాటకామాటే చెప్పుకోవాలి. కాజల్ ఏం చేసినా అందమే కానీ, మందం ఎంత మాత్రమూ కాదు.
ఏ యాంగిల్‌లోనైనా చందమామ చందమామే. ఆ నింగిలో చందమామకైనా మచ్చ ఉందేమో కానీ ఈ నేల మీద చందమామ కాజల్‌లో ఎలాంటి మచ్చలూ లేవండోయ్. అందాల ముద్దుగుమ్మే. అపరంజి బొమ్మే. అదంతే.!