గతంలో 'అహనా పెళ్లంట', 'యముడికి మొగుడు' తదితర చిత్రాలకు ఒకప్పటి సూపర్‌హిట్ టైటిల్స్‌ని పెట్టుకుని ప్రేక్షకుల్ని తనదైన కామెడీతో అలరించాలనుకున్నాడు అల్లరి నరేష్. కానీ అనుకున్న స్థాయిలో ఆ టైటిల్స్‌తో కూడిన సినిమాలు సక్సెస్ కిక్నివ్వలేదు అల్లరోడికి. ఇప్పుడు మరోసారి క్లాసిక్ టైటిల్‌ని టచ్ చేయాలనుకుంటున్నాడు. బాలయ్య హీరోగా అప్పుడెప్పుడో వచ్చిన 'బంగారు బుల్లోడు' సినిమాని తన తాజా సినిమా కోసం పరిశీలిస్తున్నాడట అల్లరి నరేష్.
ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉండేది. మినిమమ్ గ్యారంటీ హీరోగా అల్లరోడు సత్తా చాటేవాడు. కానీ మూస కథలతో పేరడీ కామెడీతో బోర్ కొట్టించేశాడు. దాంతో దాదాపుగా అల్లరోడిని అందరూ మర్చిపోయారు. ఈ మధ్య సునీల్‌తో కలిసి 'సిల్లీ ఫెలోస్' అంటూ తన కామెడీలో కాస్త డిఫరెన్స్ చూపించి ఓకే అనిపించుకున్నాడు. ఇకపోతే మహేష్‌బాబుతో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అల్లరి నరేష్ బౌన్స్‌బ్యాక్ కావచ్చేమో కానీ, ఈ సినిమాలో పూర్తి విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడట అల్లరి నరేష్.
ఇదిలా ఉంటే హీరోగానూ రెండు సినిమాలను లైన్లో పెట్టాడట. అందులో ఒకదాని కోసమే 'బంగారు బుల్లోడు' టైటిల్ అనుకుంటున్నారట. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాత కాగా, గిరి అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తున్నారు. అయితే మన అల్లరోడికి ఈ సారైనా బంగారు బుల్లోడు క్లాసిక్ టైటిల్ కలిసొస్తుందో లేదో వేచి చూడాలిక.