సినీ పరిశ్రమలో 'ఇజం' మొదలైంది పవన్ కళ్యాణ్‌తో. పవన్ కళ్యాణ్ మీద అమితమైన అభిమానంతో ఆయన అభిమానులు 'ఇజం' అనే కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. 'పవనిజం' - ఇదీ పవన్‌పై మాకున్న అభిమానం అని చెబుతూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అభిమానం అంటే తమ అభిమాన హీరోకి జై కొట్టడమే కాదు, ఇంకా చాలా చాలా అని పవన్ అభిమానులు చాటి చెప్పారు.
ఆ తర్వాత ఈ ఇజం మరికొంతమందికి అప్లై అయ్యింది. చిన్న హీరోలూ, పెద్ద హీరోలూ తేడా లేకుండా, ఆయా హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల పేర్ల చివరన ఇజం తగిలించేశారు. ఈ లిస్టులో హీరోయిన్స్ అభిమానులు కూడా ఉన్నారు. హీరోయిన్ల ఇజం విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ కాజల్‌కి దక్కుతుందేమో. కాజలిజం పేరుతో అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
వారి అభిమానానిక ముగ్ధురాలైంది కాజల్. నా పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని చెబుతూ మీ అభిమానమే నన్ను ఈ రోజు ఇలా నడిపిస్తోందని చెబుతూ సోషల్ మీడియాలో పేర్కొంది. సోషల్ మీడియాలో కాజల్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెహ్రీనిజం అంటూ మెహ్రీన్ పేరుతో కొన్ని గ్రూపులు కూడా నడుస్తున్నాయి. పేరేదైనా సేవా కార్యక్రమాల్లో అభిమానులు ముందుటే ఆభినందించదగ్గదే.