ఐటీ స్కామ్‌లో చందమామ: ఏం చేస్తున్నట్లు.!

మరిన్ని వార్తలు

మంచు విష్ణు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ‘మోసగాళ్లు’. ఈ సినిమాలో చందమామ కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. సినిమాలో కాజల్‌ పాత్ర పేరు ‘అను’ అని పరిచయం చేస్తూ రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌లో సినిమా నేపథ్యం గురించి కూడా హింట్‌ ఇచ్చారు. వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి జెఫ్రీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

kajal new look from mosagaallu

ఇటీవలే అమెరికాలో షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది. ఇక కాజల్‌ లుక్‌ విషయానికి వస్తే, కొంచెం హాట్‌గా కొంచెం ఘాటుగా కనిపిస్తోంది. వైట్‌ కలర్‌ స్లీవ్‌లెస్‌ బ్లేజర్‌ ధరించి చేతికి వాచి, చెవులకు వెడల్పాటి సింపుల్‌ ఇయర్‌ రింగ్స్‌ ధరించింది. లూజ్‌ హెయిర్‌ స్టైల్‌తో సింప్లీ సూపర్బ్‌గా కనిపిస్తోంది. కాజల్‌ ప్రామిసింగ్‌ లుక్స్‌ చూస్తుంటే, ఐటీ ఆఫీసర్‌నో లేక, ఏ కార్పొరేట్‌ ఎంప్లాయ్‌నో అనిపిస్తోంది. మరి ‘మోసగాళ్లు’లో మన చందమామ అను ఏం చేస్తుందనేది పూర్తిగా తెలియాంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాని సమ్మర్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS