అనుష్కకు ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్‌ ఇచ్చిందా.. లేక..!

మరిన్ని వార్తలు

నచ్చిన పాత్ర కోసం ఎలాంటి సాహసానికైనా వెనుకాడరు కొందరు నటీ మణులు. కానీ, రకుల్‌ పూర్తిగా భిన్నం. పాత్ర కోసం తనలోని యాక్టింగ్‌ టాలెంట్‌ని బయటికి తీసేందుకు సిద్ధమే కానీ, ఫిజికల్‌ మార్పులు చేసుకునేందుకు తానెప్పుడూ రెడీగా ఉండనని నిక్కచ్చిగా చెప్పేస్తోంది. గతంలో ‘సైజ్‌జీరో’ సినిమా కోసం స్వీటీ అనుష్క ఎంత బరువు పెరిగిందో తెలిసిందే కదా.. ఆ బరువు తగ్గించుకోవడానికి తర్వాత స్వీటీ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆ వెయిట్‌ స్ట్రెస్‌ని అనుష్క ఫేస్‌ చేస్తూనే ఉంది. ఇక ఈ మధ్య బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ ‘తలైవి’ మూవీ కోసం బరువు పెరిగింది.

 

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాత్ర కోసం కంగనా బరువు పెరగాల్సి వచ్చింది. ఇలాంటి సాహసాలు కెరీర్‌కి ప్లస్‌ అవుతాయా.? లేదా.? అనే సంగతి పక్కన పెడితే, హెల్త్‌ పరంగా రిస్కే అని చెప్పాలి. అందుకే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాత్రం ఇలాంటి సాహసాలు చేసి, ఆరోగ్యంతో ఆటలాడలేనని చెబుతోంది. ‘ఫిట్‌గా ఉండడమనేది గ్లామర్‌కి సంబంధించిన ఇష్యూ కాదు, హెల్త్‌కి సంబంధించిన ఇష్యూ. సో నా హెల్త్‌కి ఇబ్బంది కలిగేలా కెరీర్‌లో సాహసాలు చేయలేను.. నేనే కాదు, ఇలాంటి సాహసాలు ఎవరు చేసినా నేను ప్రోత్సహించను..’ అని చెబుతోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం రకుల్‌ హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘చదరంగం’ సినిమాలో నటిస్తోంది. చంద్రశేఖర్‌ ఏలేటి ఈ సినిమాకి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS