కాజల్‌ సౌత్‌కి టాటా చెప్పేస్తుందా?

By Inkmantra - August 28, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

తెలుగులో కాజల్‌కి ఈ మధ్య వరుస ఫ్లాపులొచ్చాయి. తమింలోనూ ఒక ఫ్లాప్‌ చవి చూసింది చందమామ. మరో రెండు ప్రాజెక్టులు తమిళంలో రెడీగా ఉన్నాయి. వాటిలో బిగ్‌ ప్రాజెక్ట్‌ 'ఇండియన్‌ 2', కాగా, తమిళ క్వీన్‌ 'ప్యారిస్‌ ప్యారిస్‌' ఇంకోటి. సూర్యతో మరో కొత్త ప్రాజెక్ట్‌ ఇటీవలే ఓకే చేసింది. ఇదిలా ఉంటే, కాజల్‌ ఇకపై సౌత్‌కి టాటా చెప్పేయనుందట అనే టాక్‌ ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చింది.

 

అందుకు కారణం, బాలీవుడ్‌లో కాజల్‌కి ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కిందట. జాన్‌ అబ్రహాం హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. మాఫియా బ్యాక్‌ గ్రౌండ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ముంబయ్‌ సాగా' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్‌కి పర్‌ఫామెన్స్‌ స్కోపున్న రోల్‌ దక్కిందట. సో ఈ సినిమా హిట్‌ అయితే, కాజల్‌కి అక్కడ తిరుగే లేకుండా పోతుంది.

 

అయినా, సౌత్‌ ప్రేక్షకులకు కాజల్‌ బోర్‌ కొట్టేసిందనే ఫీలింగ్‌ కూడా ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న మాట. సో నార్త్‌ ప్రేక్షకుల్ని కొత్తగా అలరించే దిశగా కాజల్‌ ప్రయత్నాలు మొదలు పెడుతుందేమో. ఈ లోగా ఆల్రెడీ తమిళంలో ఒప్పుకున్న ప్రాజెక్టులు కంప్లీట్‌ చేసేయాలనుకుంటోందట. అంటే తెలుగులో ఇక కొత్త ప్రాజెక్టులపై కాజల్‌ దృష్టి పెట్టే అవకాశాల్లేవేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS