దివిలో చందమామ గ్లామర్‌ అదిరిందమ్మా!

మరిన్ని వార్తలు

ఎంత చూసినా తనివి తీరని అందం చందమామదే. అందుకే వెనక్కి తిరిగి చూడకుండా ఆమెకు 'చందమామా' అని ముద్దు పేరు పెట్టేసుకున్నారు. ఇటీవల 'సీత'గా ప్రేక్షకుల ముందుకొచ్చిన చందమామ కాజల్‌ అగర్వాల్‌ త్వరలోనే శర్వానంద్‌ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించనుంది. వయసు పెరిగినా, అప్‌ కమింగ్‌ హీరోయిన్స్‌కి తిరుగులేని పోటీగా నిలుస్తోంది కాజల్‌ అగర్వాల్‌. స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నా, ఇప్పటికీ కుర్ర హీరోల పక్కన కూడా క్యూట్‌గా సెటిలైపోతుందంటేనే అర్ధం చేసుకోవచ్చు కాజల్‌ గ్లామర్‌, ఫిజిక్‌ ఎలాంటిదో. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా కాజల్‌ డైరీ ఇప్పుడప్పుడే ఖాళీ లేదు.

 

తమిళంలో కాజల్‌ నటిస్తున్న 'ప్యారిస్‌ ప్యారిస్‌' విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్‌ 'క్వీన్‌'కి రీమేక్‌ ఇది. దీంతో పాటు 'కోమలి' అనే మరో సినిమాలోనూ నటిస్తోంది. తెలుగులోనూ మరో రెండు మూడు ప్రాజెక్టులు కాజల్‌ చేతిలో ఉన్నాయి. సినిమాలతో బిజీగా ఉన్నా, కాజల్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాని హీటెక్కించడంలోనూ జోరు ప్రదర్శిస్తోంది. డిఫరెంట్‌ ఫోటో షూట్స్‌ చేయించుకుని కుర్రోళ్లకు కిర్రాకు పుట్టిస్తోంది. చూస్తున్నారుగా ఈ లేటెస్ట్‌ పిక్‌లో కాజల్‌ అందాలు. క్యూట్‌గా కనిపిస్తూనే, సెక్సీ అండ్‌ హాట్‌గా కవ్విస్తున్నాయి. ఈ పిక్‌ చూస్తే ఎవరికైనా అనిపిస్తుందా.? కాజల్‌ సీనియర్‌ నటి అని. ఇప్పుడే ఫ్రెష్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు లేదూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS