'4 లెటర్స్' అనే సినిమా గుర్తుంది కదండీ. మొన్నా మధ్య ఇద్దరు ముద్దుగుమ్మలు బికినీలతో తెగ రెచ్చగొట్టేశారీ సినిమాతో. హాట్ హాట్ బికినీలతో అందగత్తెలు తమ అందాల్ని విస్తరేసి వడ్డించేసిన ప్రోమోలు ఆ మధ్య తెగ హల్‌చల్ చేశాయి కదా. సినిమా విడుదలైంది. అంత సీను లేదులే అని వెళ్లిపోయింది. అయితే ఆ సినిమా గురించి కాదు కానీ, అందులో నటించిన ఓ ముద్దుగుమ్మ అంకితా మహారాణాకి ఇప్పుడు ఇంకో ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సారి అందంగా కాదు, హారర్‌తో భయపెట్టిస్తానంటోంది.
అయితే, హారర్ మూవీస్ అయినా గ్లామర్‌కి చోటు లేకుండా ఉండదులెండి. అంతకు మించి అనే స్థాయిలో ఇది కూడా భాగమైపోయింది ఇప్పుడు సినిమాల్లో. ఇక అసలు వివరాల్లోకి వెళితే, విలన్‌గా చాలా సినిమాల్లో నటించిన సుపరిచితుడైన సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే అంకితా మహారాణాకి హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. అంకితాతో పాటు, ఈ సినిమాలో ఇంకో భామ కూడా ఉందండోయ్. ఈ భామ కూడా పాపులర్ భామనే. 'లవర్స్' అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన నూరెన్ షెరీఫ్ కన్నడ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఏదో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అనే కాన్సెప్ట్ కాకుండా, ఈ సినిమాకి డిఫరెంట్ కథాంశాన్ని కాన్సెప్ట్‌గా ఎంచుకున్నారు డైరెక్టర్.
ఇంతకీ సినిమా కథ ఏంటంటే, దెయ్యాలు, మనుషుల్లా.. మనుషులు దెయ్యాల్లా.. ఒక్కోసారి ఎవరెవరో తెలియకుండా వింతగా ప్రవర్తిస్తుంటారట. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారట. ఇదే కాన్సెప్ట్‌తో గతంలో తాప్సీ ప్రధాన పాత్రలో 'ఆనందోబ్రహ్మ' సినిమా రూపొందింది. ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. మరి బికినీ బ్యూటీ, లవర్ బ్యూటీస్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ఈ తాజా చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలిక.