అందాల చందమామ ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి హాట్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. ఆ పోస్టింగ్ వెనక ఆంతర్యమేమో కానీ, కాజల్‌లో ఇన్ని గ్లామర్ యాంగిల్స్ ఉన్నాయా? అని ఆమె ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఆ ఫోటో షూట్స్.
ఇప్పటికే స్క్రీన్‌పై కాజల్ గ్లామర్‌ని మ్యాగ్జిమమ్ యాంగిల్స్‌లో చూసేశాం. కానీ, ఆమె కొత్తగా చేయించుకుంటున్న హాట్ ఫోటో షూట్లు కళాత్మకంగా ఉంటున్నాయి. దాంతో, కూసింత కళాపోషణ ఉన్నోళ్లకైనా ఆ ఫోటోలు బాగా రీచ్ అయిపోతున్నాయి.
ఏదేమైనా చెప్పండి కానీ, చందమామ గ్లామర్‌కి సాటింకెవరు.? అని ఎవరికి తోచిన రీతిలో వారు తమలోని కవి హృదయాల్ని నిద్ర లేపుతున్నారు.
అసలే కాజల్‌కి సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఆ పిచ్చ కాస్తా, ఇప్పుడు వెర్రిలా మారిపోయింది. ఇక తాజా పిక్స్ విషయానికొస్తే, చూస్తున్నారుగా. చెక్స్ అల్ట్రా మోడ్రన్ డిజైనర్ వేర్‌లో కాజల్ అందాలు ఎంత బ్రైట్‌గా మెరిసిపోతున్నాయో.
ఫలౌజాని తలపిస్తోన్న ఆ బోటమ్, వింగ్స్ స్లీవ్స్‌తో టాప్ డిజైన్, రన్నింగ్ ప్యాటర్న్ అయినా, సింప్లీ సూపర్బ్ అని కామెంట్ ఇచ్చేలా ఉంది ఈ కాస్ట్యూమ్. ఈ సూపర్బ్ డ్రస్‌లో కాజల్ సోఫాపై ఓ కాలు కిందా, ఇంకో కాలు పైన పెట్టి కూర్చొని ఇచ్చిన పోజుంది చూశారూ.. కేకో కేక, ఇక ఆ సిగ్గుపడుతున్న స్టిల్‌కి సిగ్గుకే సిగ్గు పుట్టించేలా ఉంది.!