బాలీవుడ్ 'క్వీన్' రీమేక్‌గా దక్షిణాదిలోని నాలుగు భాషల్లో తెరకెక్కుతోన్న 'క్వీన్' రీమేక్స్ నుండి ఒకేరోజు నాలుగు లుక్స్ బయటికి వచ్చాయి. వాటిలో తమిళ్ క్వీన్ కాజల్‌కీ, తెలుగు క్వీన్ తమన్నాకి స్టార్‌డమ్ ఎక్కువ. వీరిద్దరికీ తెలుగుతో పాటు, తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీలో కూడా ఈ ఇద్దరికీ పాపులారిటీ ఉండడం మరో అడ్వాంటేజ్.
ఇకపోతే విడుదలైన నాలుగు లుక్స్‌లోనూ కాజల్ లుక్‌కి ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. హొవర్ బోర్డ్ మీద కూర్చుని రెండు చేతులు గాలిలోకి చాపి, జోష్‌గా స్మైల్ ఇస్తున్న కాజల్ లుక్‌కి అంతే జోష్‌ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్‌లో తెల్లని పావురాలు ఎగురుతూ ఉన్నాయి. లుక్ చాలా ఆహ్లాదంగా అనిపిస్తోంది. 'ప్యారిస్ ప్యారిస్ ' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎక్కువ భాగం ఈ సినిమాని ప్యారిస్‌లోనే చిత్రీకరించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో కాజల్‌తో పాటు మిగిలిన ముగ్గురు క్వీన్స్ ఒకేచోట స్టే చేయడం, షూటింగ్‌ని ఎంతో బాగా ఎంజాయ్ చేయడం అంతా ఓ పండగలా సాగిందనీ, ఇదో గొప్ప ఎక్స్‌పీరియన్స్ అనీ అంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. కాజల్ విషయానికి వస్తే, వయసుతో పాటు పెరుగుతోందీ చందమామ అందం. కెరీర్ దాదాపుగా క్లోజ్ అయిపోయిందనుకున్న టైంలో 'ఖైదీ'తో మెగా ఆఫర్ రావడం, మళ్లీ కెరీర్ దూకుడు అందుకోవడం తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకోవడం అన్నీ ఫాస్ట్‌గా జరిగిపోయాయి.
బాలీవుడ్‌లో కంగనాకి 'క్వీన్'గా కెరీర్ బెస్ట్ గుర్తింపు దక్కింది. అలాంటి గుర్తింపునే ఇప్పుడు కాజల్, తమన్నా తదితర క్వీన్స్‌కి కూడా దక్కుతుందని అంచనా వేస్తున్నారు.