తెలుగు సినిమా 'హలో గురు ప్రేమ కోసమే' తో పోటీగా విడుదలైన డబ్బింగ్ బొమ్మ `పందెం కోడి2`. పందెంకోడి 1.. సూపర్ హిట్ అవ్వడం, విశాల్‌కి తెలుగు నాట అభిమానులు ఏర్పడడం, కీర్తి సురేష్ గ్లామర్, దసరా సెలవలు.. ఈ సినిమాకి కలిసొచ్చాయి. అందుకే తొలిరోజు మంచి వసూళ్లని సాధించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా 1.80 కోట్ల షేర్ అందుకుంది. విశాల్ సినిమాల్లో ఇదే రికార్డు. నైజాంలో రూ.40 లక్షలు అందుకున్న పందెం కోడి.. సీడెడ్‌లో రూ.35 లక్షల వరకూ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారుగా రూ.9 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందట. బాక్సాఫీసు వసూళ్లు బాగానే ఉన్నా, రివ్యూలు మాత్రం యావరేజ్‌గా కనిపిస్తున్నాయి. దసరా సెలవలు ఒక్కటే పందెంకోడిని గట్టెక్కించాలి. ఈ వారాంతంలో ఎంత తెచ్చుకున్నా... డిస్టిబ్యూటర్లకు నష్టాలు తప్పేట్టు లేవని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి.
తమిళనాట మాత్రం విశాల్ సినిమా జోరుగానే వసూళ్లు అందుకుంటోంది. ఇక్కడ టాక్ ఎలా ఉన్నా... తమిళంలో మాత్రం విజయపథంలో దూసుకుపోతోంది.