గ్లామర్ అంటే బాహ్య సౌందర్యం కాదు. పొట్టి పొట్టి దుస్తుల్లో కనిపించే అంగాంగ ప్రదర్శన అంతకన్నా కాదంటోంది అందాల చందమామ. దాదాపు పదేళ్లకు పైగానే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హవా చాటుకుంటోన్న చందమామ, ఇప్పటికీ వన్నె తరగని అందంతో, వరుస అవకాశాలతో దూసుకెళ్లిపోతోంది. నటిగా ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ, సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటోంది. ఇంకా తాను చేయాల్సిన డ్రీమ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయంటోంది. గ్లామర్ పాత్రలతో పాటు, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా కనిపించి మెప్పించింది. అయితే ఇంతవరకూ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లో నటించే సాహసం చేయలేదు కాజల్. గ్లామర్ విషయానికి వస్తే, కళ్లు చెదిరే హాట్‌నెస్ ఉన్నా, ఎక్కడా హద్దులు మీరకుండా కుర్రకారును కట్టి పాడేసింది. ప్రస్తుతం 'క్వీన్' తమిళ రీమేక్‌లో నటిస్తోంది. తెలుగులో యంగ్ హీరోస్ శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో నటిస్తోంది.