సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన పేపర్ బాయ్ ఆగస్ట్ 31న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు. పేపర్ బాయ్ లో సంతోష్ శోభన్ కు జోడీగా రియా సుమన్, తాన్యా హోప్ నటించారు. జయ శంకర్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన పేపర్ బాయ్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ వ్యూస్ కూడా దాటింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ ఇవ్వడమే కాకుండా తన సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించారు.