బ్లూ హాట్‌ 'చందమామ'.!

By iQlikMovies - July 03, 2018 - 16:03 PM IST

మరిన్ని వార్తలు

నీలి మేఘాలు, అక్కడక్కడా వెండి మెరుగులు దిద్దుకున్న ఆకాశం చూసేందుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తోంది. ఆ ఆహ్లాదాన్ని మరింత ఆనందమయం చేసేలా ఉంది చందమామ కాజల్‌ అగర్వాల్‌ హాట్‌ పోజు. క్యూట్‌ అప్పీల్‌తో ఆకాశాన్ని ఈ ముద్దుగుమ్మ ఆస్వాదించడమే కాకుండా, అటు నీలి నింగిలోని బులుగు మేఘాల్నీ, నేలపై నీలి చందమామ అందాల్ని ఒకేసారి చూసి ఆస్వాదించేందుకు రెండు కళ్లూ చాలడం లేదే అనిపిస్తోంది కదా. మూడు పదుల వయసులోనూ కాజల్‌ వన్నె తరగని అందంతో మెరిసిపోతోంది. అంతేనా, కెరీర్‌లో కూడా ఎక్కడా బ్రేకుల్లేకుండా సాగిపోతోంది. స్టార్‌ హీరోలకే కాక కుర్రహీరోలకూ సరిజోడీ అవుతోంది. ప్రస్తుతం కాజల్‌ తమిళంలో 'ప్యారిస్‌ ప్యారిస్‌' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో కొత్తగా వరుస ప్రాజెక్టులను సైన్‌ చేసే దిశగా చక చకా అడుగులు వేస్తోంది. ఇటు గ్లామర్‌ పరంగానూ, అటు ఆఫర్స్‌ పరంగానూ కూడా కొత్త భామలకు గట్టి పోటీ ఇస్తోంది అందాల చందమామ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS