చైతూ 'సవ్యసాచి' వచ్చేదింకెప్పుడు.!

మరిన్ని వార్తలు

'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాతో హిట్‌ కొట్టడమే కాకుండా, కెరీర్‌లో మంచి వసూళ్లు రాబట్టాడు అక్కినేని బుల్లోడు నాగచైతన్య. అయితే ఆ తర్వాత వచ్చిన 'యుద్దం శరణం'తో భారీగా నిరాశ పరిచాడు. ఈ రెండు సినిమాలు వచ్చి చాలా కాలమే అయ్యింది. 

ఆ తర్వాత చైతూ నుండి మరో సినిమా రాలేదు. 'ప్రేమమ్‌' వంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన చందూ మొండేటితో చైతూ 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యి చాలా కాలమే అయ్యింది. సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఇంకా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ కాలేదు. చైతూ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయి. 

అయితే చైతూ స్టామినా ఏంటనేది తెలియాలంటే వీలైనంత తొందరగా చైతూ నుండి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి. అది 'సవ్యసాచి' సినిమానే కావాలి. ఈ సినిమాలో చాలా చాలా ప్రత్యేకతలున్నాయి. చైతూ ఓ డిఫరెంట్‌ రోల్‌లో కనిపించనున్నాడు. రెండు చేతులనూ సమర్ధవంతంగా ఉపయోగించగల సామర్ధ్యం ఉన్న కుర్రాడి పాత్రలో చైతూ కనిపించనున్నాడు. తమిళ హీరో మాధవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఇకపోతే మరోవైపు చైతూ, మారుతి డైరెక్షన్‌లో 'శైలజారెడ్డి అల్లుడు' అనే ఫ్యామిలీ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్‌, చైతూకి జోడీగా నటిస్తోందీ సినిమాలో. 

ఇది కాక వెంకీతో ఓ మల్టీ స్టారర్‌లో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా కోసం పెళ్లి తర్వాత సమంతతో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు మన అక్కినేని బుల్లోడు నాగచైతన్య. సో ఇప్పట్లో చైతూ డైరీ అస్సలు ఖాళీ లేదనే చెప్పాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS