బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన 'క్వీన్' మూవీని సౌత్‌లో నాలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు క్వీన్‌గా తమన్నా నటిస్తుండగా, తమిళ క్వీన్‌గా కాజల్ నటిస్తోంది. మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో ఫరూల్ యాదవ్ క్వీన్ పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో ఈ క్వీన్స్ ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. కానీ, అనేక కారణాలతో విడుదల ఆలస్యం అవుతోంది.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం తమిళ క్వీన్‌కి సెన్సార్ కష్టాలు మొదలయ్యాయట. కాన్సెప్ట్ ఒకటే అయినా, వివిధ భాషల్లో నేటివిటీ కోసం చిన్నా, చితకా మార్పులు చేశారు. ఆ మార్పుల్లో భాగంగా, కాజల్ క్వీన్ 'ప్యారిస్ ప్యారిస్'లో కొన్ని బోల్డ్ సీన్స్, బోల్డ్ డైలాగులు ఉన్నాయని సెన్సార్ బోర్డ్ నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయట. గతంలో టీజర్ వదిలినప్పుడు కూడా కాజల్ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్లీ సెన్సార్ వద్ద కూడా కష్టాలంటే పాపం చందమామ.. తెగ ఫీలైపోతోందట.
అలా ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ వద్ద ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గాసిప్‌లో నిజమెంతో తెలీదు కానీ, సినిమా సెన్సార్ వరకూ వచ్చిందంటే, త్వరలో విడుదలవుతుందనే అర్ధం చేసుకోవాలి. ఇక తెలుగు క్వీన్‌ని 'దటీజ్ మహాలక్ష్మీ' పేరుతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 'అ' దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ సినిమా అప్‌డేట్ ఏంటనేది తెలియాల్సి ఉంది