దశాబ్ధానికి పైగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. హీరోయిన్స్ అన్నాక ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూమర్‌తో వార్తల్లో సంచలనంగా నిలవడం సహజమే. కానీ, కాజల్ మాత్రం ఎలాంటి రూమర్స్‌కీ చిక్కలేదింతవరకూ. ఎలాంటి రూమర్స్, గాసిప్స్ లేని నటిగా కాజల్‌కి మంచి పేరుంది. అయితే, చిట్ట చివరికి కాజల్ తప్పించుకోలేకపోయింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ లవ్‌లో ఉందంటూ, వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకు కారణం ఓ ఫోటో. తాజాగా కాజల్ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. సంధ్యా సమయంలో సముద్ర తీరాన వెనక్కి తిరిగి ఒంటి కాలిపై నిలబడి, రెండు చేతులూ పైకెత్తి సంధ్యా వందనం చేస్తున్న ఫోటో అది. అయితే, దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఆ ఫోటోలోనే అసలు కిక్కు దాగి ఉంది. తన చేతి వేళ్లతో లవ్ సింబల్‌ని చూపిస్తోంది కాజల్ అగర్వాల్. ఇంకేముంది.. అంత క్లియర్‌గా చూపిస్తే, మన నెటిజన్లు ఊరుకుంటారా.? అసలే పొగ లేకుండానే నిప్పు పుట్టించేసే టాలెంట్ ఉన్నోళ్లు మన నెటిజన్లు. అలాంటిది కాజల్ ఇంత పెద్ద హింట్ ఇస్తే, కనిపెట్టకుండా ఉంటారా.? మరోవైపు ఓ బిజినెస్‌మేన్‌తో కాజల్ పీకల్లోతు లవ్లఓ ఉందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు, ఆయనతోనే కాజల్ వివాహమనీ, కుటుంబ సభ్యులు కూడా ఇందుకు సమ్మతమేననీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే అందాల చందమామ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న మాట. ప్రస్తుతం కాజల్ చేతిలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. కమల్ హాసన్‌తో 'ఇండియన్ 2' ప్రాజెక్టుతో పాటు, మంచు విష్ణుతో 'కాల్ సెంటర్' అనే మూవీలో నటిస్తోంది. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.