కాజల్ అగర్వాల్‌పై గాసిప్స్, రూమర్స్ చాలా తక్కువగా వినిపిస్తుంటాయి. హీరోయిన్స్‌పై సహజంగా వినిపించే లవ్ అఫైర్స్ న్యూస్ కూడా కాజల్‌పై చాలా తక్కువ. అలాంటిది కాజల్‌పై ఓ ఎయిర్ న్యూస్ (గాలి వార్త) తాజాగా వైరల్ అవుతోంది. ఈ మధ్య కాజల్ కెరీర్ కాస్త స్లో అయినట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆమె తన రెమ్యునరేషన్ బాగా తగ్గించేసిందంటూ ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నో ఛాన్స్.. కాజల్ అలా చేసే అవకాశమే లేదు. ఎందుకంటే, కాజల్ పైకి కనిపిస్తున్నట్లు ఏమంత ఖాళీగా లేదు. తెలుగులో కొన్ని కొత్త ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో ఆల్రెడీ రెండు బిగ్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. హిందీలో జాన్ అబ్రహాం హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ కాజల్ నటిస్తోంది. సో కాజల్ ఎక్కడ ఖాళీగా ఉంది. అలాంటప్పుడు తన రెమ్యునరేషన్ తగ్గించుకునే అవసరం ఏముంది.? అంటూ వైరల్ అవుతున్న న్యూస్‌ని ఆమె ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. అయితే, కాజల్‌పై సర్క్యులేట్ అవుతున్న ఈ వైరల్ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే చందమామ స్పందించాల్సిందే.
అయినా ఇలాంటి న్యూస్ పట్ల కాజల్ రెస్పాండ్ అవుతుందా.? అది కూడా డౌటే. ఇక వయసుతో పాటే, కాజల్ గ్లామర్ కూడా పెంచేస్తోంది. ఆ గ్లామర్‌తోనే నేటి హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తోంది. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న కాజల్‌కి అవకాశాలు ఎలా తగ్గుతాయ్ చెప్పండి. అన్నట్లు కాజల్ ఈ మధ్య 'సీత' సినిమాలో నెగిటివ్ ఛాయలున్న వైవిధ్యమైన పాత్రలో నటించి, ప్రయోగాలకూ తాను సై అనిపించుకుంది అందాల కాజల్ అగర్వాల్.