'ఇండియన్‌ 2'లో కాజల్‌ పాత్ర తెలిసిపోయింది!

మరిన్ని వార్తలు

చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఈ మధ్య ప్రయోగాలకు తెర లేపిన సంగతి తెలిసిందే. 'సీత' సినిమాతో తెలుగులో విలనిజం చూపించింది. సక్సెస్‌ అయ్యిందా.? లేదా.? అనే విషయం పక్కన పెడితే, తానూ ప్రయోగాలకు సై అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా నిరూపించింది కాజల్‌. అలాగే, విశ్వనటుడు కమల్‌ హాసన్‌తో 'ఇండియన్‌ 2' సినిమాలో కాజల్‌కి అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ సినిమాలో కాజల్‌ పాత్ర ఏంటో తెలుసా.? 85 ఏళ్ల బామ్మ పాత్రట. ఇలాంటి పాత్రలో కాజల్‌ ఎందుకు ఒప్పుకుందా.? అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

 

అయితే, నటిగా నిరూపించుకోవాలంటే, అన్ని రకాల పాత్రలూ పోషించి చూపించాలి. ఇన్నాళ్లూ కాజల్‌లోని గ్లామర్‌ మాత్రమే చూసిన అభిమానులు ఇకపై ఆమెలోని పరిపక్వత చెందిన నటిని చూస్తారంటోంది. శంకర్‌ సినిమాలో ఏ చిన్న పాత్రలోనైనా నటించాలన్నది తన కోరిక అనీ, అలాంటిది ఇంత మంచి పాత్ర తనకి దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నానని చెబుతోంది. ఈ పాత్రకు ముఖ్యంగా మేకప్‌ చెప్పుకోదగ్గదనీ, శంకర్‌ సినిమాల్లో కీ రోల్‌ పాఠించేది మేకప్పే అనీ, అలాంటి మేకప్‌ ఓరియెంటెడ్‌ పాత్ర తనకు దక్కినందుకు ఆ ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ, తన పాత్ర గురించి చెప్పి తెగ మురిసిపోతోంది కాజల్‌ అగర్వాల్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తానా.? అంటూ సగటు ప్రేక్షకురాలిగా ఎదురు చూస్తున్నా అంటూ ఆసక్తి కనబరుస్తోంది. ఇకపోతే, కాజల్‌ తెలుగులో మంచు విష్ణు రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. హిందీలోనూ ఓ సినిమాలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS