పదేళ్లయినా తరగని అందంతో నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 'చందమామ' సినిమాతో నిజంగా చందమామే అనిపించుకుంది. పదేళ్ల కిందట ఫిబ్రవరి 15న కాజల్ నటించిన తొలి సినిమా 'లక్ష్మీ కళ్యాణం' విడుదలయ్యింది. కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటు కాజల్‌కీ, అటు కళ్యాణ్‌రామ్‌కీ కూడా మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా వచ్చి పదేళ్లయిన సందర్భంగా తన కెరీర్‌లో జరిగిన మెమరీస్‌ని తలచుకుంటూ, తనకింత గుర్తింపు తెచ్చి పెట్టిన అభిమానులకు ముద్దుగుమ్మ కాజల్ సోషల్ మీడియా ద్వారా ధాంక్స్ చెప్పింది. కెరీర్‌లో వచ్చిన ప్రతీ సక్సెస్‌నీ ఎంత ఎంజాయ్ చేశానో, అలాగే ఆ సక్సెస్‌ని పొందడానికి పడిన ఇబ్బందులు కూడా అలాగే ఎంజాయ్ చేశాను. అయితే ఒక్కటే తేడా ఫెయిల్యూర్స్ తనని మరింత స్ట్రాంగ్ అవ్వడానికి, కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి ఎంతగానో దోహదం చేశాయి అంటోంది ముద్దుగుమ్మ కాజల్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ తెలుగులోనే ఈ భామకి ఇంత స్టార్‌డమ్ వచ్చింది. అందుకే తెలుగు అభిమానులకు ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేనని చెబుతోంది. మరింత ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నిస్తానంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లో నటించింది. కొత్త ఇన్నింగ్స్‌ని సీనియర్ హీరో మెగాస్టార్‌తో స్టార్ట్ చేసింది. ఇక ఈ రేంజ్‌లో నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల నెక్స్ట్ ఛాయిస్ కూడా కాజల్‌దే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.