చందమామ కాజల్ ఇప్పుడు మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. దాదాపు ఐదారు సినిమాలున్నాయి కాజల్ చేతిలో అన్ని భాషల్లోనూ కలిపి. కెరీర్‌లో ఇంత బిజీగా ఉంటే, ఆమెను మరోపక్క ఇంకో ప్రశ్న వేధిస్తోంది. అభిమానుల నుండి ఈ మధ్య సూటిగా కాజల్‌ని ఓ ప్రశ్న పదే పదే వెంటాడి ఇబ్బంది పెడుతోంది. అదే 'పెళ్లెప్పుడు కాజల్.?' అనే ప్రశ్న. అయితే, కాజల్‌కి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పదే పదే చెబుతున్నా, అభిమానులు వినిపించుకోవడం లేదు. ఇంకా సింగిల్‌గానే ఉంటావా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
కొందరైతే ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారట. అవును కెరీర్‌లో బిజీగా ఉన్నా సమంత లాంటి స్టార్లు వివాహ బంధాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పాపం కాజల్ మాత్రం కెరీర్ పేరు చెప్పి, పెళ్లిని వాయిదా వేస్తోందంటూ పాపం ఫ్యాన్స్ తెగ ఫీలయిపోతున్నారు. అయితే, అదృష్టం అందరికీ కలిసి రాదు సమంతలా. ఒకవేళ పెళ్లి తర్వాత కెరీర్ డల్ అయిపోతే ఏం చేసేది. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా.. అయితే, కాజల్ ఇల్లు ఎప్పుడో చక్కబెట్టేసింది. కానీ, ఎందుకో పర్సనల్ లైఫ్‌ని మాత్రం ఎంజాయ్ చేయడం లేదు.
ఇంతవరకూ అఫైర్స్ పేరు చెప్పి కాజల్‌పై ఎలాంటి గాసిప్స్ పుట్టలేదు. కానీ, ఈ మధ్య ఆ ముచ్చట కూడా తీరిపోతున్నట్లుంది. కాజల్ లవ్‌లో పడిందట.. అంటూ కొన్ని గాసిప్స్ పుట్టించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరి కాజల్ భామ వీటిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలిక. తమిళంలో ప్రెస్టీజియస్ మూవీ 'ఇండియన్ 2'లో నటిస్తోంది కాజల్. విడుదలకు సిద్దంగా రెండు సినిమాలున్నాయి. ఓ వెబ్ సిరీస్‌లోనూ కాజల్ నటిస్తోంది.