ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కాజల్ అగర్వాల్ బికినీలతో రెచ్చిపోయింది. ఏదో అలా బికినీ వేశాను అన్నట్లుగా కాకుండా, ఆ బికినీలతో చేసిన రచ్చ రంభోలా అంతా ఇంతా కాదు. కాజల్‌ని అలా చూసిన నెటిజన్లు కాజల్ ఎందుకిలా చేసింది.? అని ముక్కున వేలేసుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్స్ లిస్టులో కాజల్ అగర్వాల్‌ని పడేశారు ఇప్పటికే. అయితే, కెరీర్లో కాజల్ ఇంకా ఇంకా ఏదో సాధించాలనుకుంటోందట. చెల్లెలు నిషా అగర్వాల్‌కి కెరీర్లో పెద్దగా కలిసి రాక, బుద్ధిగా పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి తల్లి కూడా అయిపోయింది. కానీ, చందమామ మాత్రం కెరీర్లో ఇంకా ఎత్తులు, లోతులూ అంటూ ఏవేవో వెతుకుతూ ఇక్కడే ఉండిపోయింది.
పప్పన్నం ఎప్పుడు పెడతావ్ అంటూ కాజు పాపని ఫ్యాన్స్ డైరెక్ట్‌గా ప్రశ్నించేస్తున్నారు. కానీ, కాజల్ ఆలోచనలు చూస్తుంటే, ఇప్పట్లో అలాంటిదేమీ ఉన్నట్లు కనిపించడం లేదు. మొన్నా మధ్య కాజల్ లవ్‌లో పడిందంటూ గాచిప్స్ చక్కర్లు కొట్టాయి. కానీ, గా'చిప్స్'గానే మిగిలిపోయాయవి. ఇదిలా ఉంటే, తాజాగా కాజల్ చేసిన అందాల రచ్చ చూస్తుంటే, ఏదో పెద్ద చేపకే కాజల్ గాలమేసినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే కాజల్ చేతిలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'ఇండియన్ 2' ఉంది. దాంతో పాటు, తెలుగు, తమిళ భాషల్లోనూ ఒకటీ, అరా సినిమాలతోనూ, వెబ్ సిరీస్‌తోనూ బిజీగానే ఉంది. కానీ, ఈ దాహం తీరేలా లేదు కాజల్‌కి. లేటు వయసులో హీటు సెగలు పుట్టిస్తూ, ఇంకా ఏదో సాధించాలని కసిగా కనిపిస్తోంది. తాజా బికినీ పోజులతో అందరి నోళ్లలోనూ తెగ నానుతున్న కాజల్ గట్స్‌ని ఎంతైనా మెచ్చుకొని తీరాల్సిందే సుమీ.!