'జెర్సీ' సినిమాలో నేచురల్ స్టార్ నాని 36 ఏళ్ల వయసులో తన కల నెరవేర్చుకుంటాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ని కొన్ని కారణాల వల్ల వదులుకోవల్సి వస్తుంది. ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆడాలన్న తన కల వైవాహిక జీవితంతో మధ్యలోనే ఆగిపోతుంది. మరి ఆ కలను మన హీరో 36 ఏళ్ల వయసులో నెరవేర్చుకుంటాడు. అవును ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే టైమ్ అది. ఇప్పుడు ఇదే నేపథ్యంలో బాలీవుడ్‌లో మరో ఆట కథ రూపొందింది. ఈ సినిమాలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ప్రధాన పాత్ర పోషించింది.
'పంగా' అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాలో మంచి కబడ్డీ ప్లేయర్‌గా రాణించాలనుకున్న ఓ మధ్యతరగతి అమ్మాయి కథ వైవాహిక బంధం కారణంగానే మధ్యలోనే ఆగిపోతుంది. అయితే, వివాహం తర్వాత నానిలాగే, ఓ బిడ్డకి జన్మనిచ్చాక తనకి తన డ్రీమ్ నెరవేర్చుకునే అవకాశం వస్తుంది. మరి వచ్చిన ఆ అవకాశాన్ని ఆ వయసులో, వివాహ బంధం, బాధ్యతల నడుమ ఆ తల్లి ఎలా సద్వినియోగం చేసుకుంది.? తెలియాలంటే 'పంగా' చూడాల్సిందే. నాని 'జెర్సీ' సినిమాని పోలి ఉన్న ఈ కథలో కంగనా పర్‌ఫామెన్స్ మెయిన్ అట్రాక్షన్ కానుంది.
మరోవైపు కంగనా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'తలైవి' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం కంగనా బరువు పెరిగి, అచ్చంగా జయలలితలా మేకోవర్ చెందింది. రీసెంట్‌గా విడుదలైన ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.