వెండి తెరపై ఎన్నో ప్రేమకథా చిత్రాలలో నటించింది కాజల్. నిజ జీవితంలోనూ అలానే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల గౌతమ్ తో కాజల్ వివాహమైన సంగతి తెలిసిందే. అసలు కాజల్ - గౌతమ్ ఎవరు? వీళ్లిద్దరికీ పరిచయం ఎలా జరిగింది? ఆ ప్రేమకథ ఎప్పటిది? ఇలా అనేక రకాలైన ఆసక్తికరమైన ప్రశ్నలు చెలరేగాయి. ఇప్పుడు వాటన్నింటికీ కాజల్ సమాధానం చెప్పింది.
ఉమ్మడి స్నేహితుల ద్వారా పదేళ్ల క్రితం గౌతమ్ తో పరిచయం అయ్యింది. ఆ తరవాత అది స్నేహంగా మారింది. తరచూ మేం కలుసుకునేవాళ్లం. మూడేళ్లు తనతో డేటింగ్ చేశా. ఇటీవల లాక్ డౌన్ కాలంలో తనపై నాకెంత ఇష్టం ఉందో తెలిసింది. ఆ రెండు నెలలూ ఒకరిని ఒకరం కలుసుకోలేకపోయాం. ఆ రోజుల్లో చాలా బాధ పడ్డా. తనని ఎంత ప్రేమిస్తున్నానో అర్థమైంది.
ఓరోజు.. తను మా ఇంటికొచ్చి అమ్మానాన్నలతో మాట్లాడాడు. వాళ్లు మా పెళ్లికి ఒప్పుకున్నారు. రెండు నెలల్లో మా పెళ్లి జరిగిపోయింది`` అని తన ప్రేమకథని తొలిసారి మీడియా ముందుకు తెచ్చిందీ చందమామ.