కొత్త పెళ్ళికూతురు కాజల్ అగర్వాల్, తన భర్తతో కలిసి హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తోంది. అత్యంత లగ్జరియస్‌గా హనీమూన్‌ని కాజల్, ఆమె భర్త గౌతం ప్లాన్ చేసుకోవడం మామూలే. సినీ వర్గాల్లో నడుస్తున్న గాసిప్స్ ప్రకారం చూస్తే, 50 లక్షలు ఆ పైనే ఈ హనీమూన్ కోసం కాజల్ - గౌతం వెచ్చించారట. ఆ సంగతి పక్కన పెడితే, కాజల్ ఎప్పటికప్పుడు తన హనీమూన్ అప్‌డేట్స్‌ని సోషల్ మీడియాలో వుంచుతోంది.
తద్వారా ఆమెకు ఆర్థికంగా బాగానే వర్కవుట్ అవుతోందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసేస్తోంది. తారల వ్యక్తిగత విశేషాలకు విపరీతమైన క్రేజ్ వుండడం సహజమే. కాజల్‌కి వున్న ఫాలోయింగ్ నేపథ్యంలో, తన పెళ్ళి తదనంతర వ్యవహారాలపై వున్న క్రేజ్‌ని ఆమె బాగానే క్యాష్ చేసుకుంటోందని అంటున్నారు. పైగా కాజల్ ఏం చేసినా, అది బిజినెస్ మైండ్‌తోనే వుంటుంది.. సో, ఈ హనీమూన్ ఎపిసోడ్ కూడా అంతేనంటూ చర్చ జరుగుతోంది. నిజమేనా.? అంటే, ఈ ప్రశ్నకు ఇంకా కాజల్ సమాధానం చెప్పాల్సి వుంది.
ఇంతకీ, కాజల్ హనీమూన్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుంది.? తిరిగి సినిమాలకు ఎప్పుడు ‘సై’ అంటుంది.? కాజల్ వెంటనే చేయాల్సిన సినిమా తెలుగులో ‘ఆచార్య’. ఇటీవలే ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పునఃప్రారంభమయ్యింది. రేపో మాపో మెగాస్టార్, సెట్‌లోకి అడుగు పెడతారు. ఆ తర్వాత కాజల్ కూడా సెట్‌లోకి అడుగు పెట్టనుంది.