నవతరం భామల ధాటికి వెటరన్ హీరోయిన్లంతా మరుగున పడిపోతున్నారు. నయనతార, అనుష్క... ఇలాంటి వాళ్లంతా యువ హీరోయిన్లకు దారిచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి క్లిష్టమైన తరుణంలోనూ కాజల్ అవకాశాల్ని చేజిక్కించుకుంటోంది. తనకు కాస్త అదృష్టం కూడా కలిసొస్తోంది. చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో అనుకోకుండా ఛాన్స్ కొట్టేసింది. త్రిష డ్రాప్ అవ్వడంతో ఆ ప్లేసు కాజల్‌తో భర్తీ చేసింది చిత్రబృందం. మరోవైపు భారతీయుడు 2లో నటిస్తోంది. జాన్ అబ్రహాంతో కలిసి ఓ హిందీ సినిమా చేస్తోంది. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ అందుకుంది.
విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది, ఇందులో కాజల్‌ని కథానాయికగా ఎంచుకున్నారని టాక్. గతంలో విజయ్ - మురుగదాస్ కాంబోలో వచ్చిన తుపాకీలో కాజల్ కథానాయికగా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్టైంది. ఆ సెంటిమెంట్‌తో మరోసారి కాజల్‌నే కథానాయికగా ఎంచుకోవాలని చిత్రబృందం ఫిక్స్ అయ్యిందట. అలా.. మరో బంగారం లాంటి అవకాశాన్ని ఒడిసిపట్టుకోగలిగింది. సుడి ఉంటే ఇంతే. అవకాశాలు వెదుక్కుంటూ మరీ వస్తాయి.