దైవం మానుష్య రూపేణా అంటుంటారు. కష్టకాలంలో ఆదుకునేవాడే... దేవుడు. వెండి తెర హీరోలు రియల్ హీరోలుగా అవతారం ఎత్తేదీ ఇలాంటి తరుణంలోనే. ప్రపంచం మొత్తం ఇప్పుడు అలాంటి హీరోల కోసమే ఎదురుచూస్తోంది. కరోనా తో అట్టుడికిపోతున్న ప్రజానికాన్ని ఆదుకునే చేతులు కావాలిప్పుడు. ఎప్పటిలానే అలాంటి చేయి ఒకటి.. ప్రజల కన్నీళ్లు తుడవడానికి నేనున్నా అంటూ ముందుకొచ్చింది. తనే.. పవన్ కల్యాణ్. తెలుగు ప్రజలకు ఎప్పుడు ఎలాంటి కష్టం ఆదుకోవడానికి ముందుంటాడు పవన్ కల్యాణ్.
ఇటీవలే సైనిక సంక్షేమానికి కోటి రూపాయల సహాయం అందించాడు. ఇప్పుడు కరోనా బాధితుల కోసం మరో కోటి ఇవ్వబోతున్నాడు. కరోనాపై పోరాడుతున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ తన వంతు సాయం గా ముఖ్య మంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షలు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన చేశాడు పవన్. త్వరలోనే ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రుల్ని నేరుగా కలిసి అందించబోతున్నాడు. అలాగే ప్రధాన మంత్రి (పి.యమ్) రిలీఫ్ ఫండ్ కు మరో కోటి రు. విరాళం ప్రకటించారు.
I will be donating Rs.1 crore to PM relief fund to support our https://t.co/83OmZ9biYX Sri @narendramodi ji,in turbulent times like this. His exemplary and inspiring leadership would truly bring our country from this Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
I will be donating Rs.50 Lakhs each to both AP and Telangana CM relief funds to fight against Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020