బెల్లంకొండ తో మెహ్రీన్‌, కాజల్‌ గ్లామరస్‌ ఫైట్‌.!

By iQlikMovies - December 03, 2018 - 17:40 PM IST

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ మెహ్రీన్‌కౌర్‌ సీనియర్‌ హీరోయిన్స్‌తో గ్లామర్‌లో పోటీ పడుతోంది. ఓ పక్క మిల్కీబ్యూటీ తమన్నాతో 'ఎఫ్‌ 2' లో నటిస్తూనే, మరోపక్క చందమామ కాజల్‌తో 'కవచం' సినిమాలో నటిస్తోంది. పర్‌ఫామెన్స్‌తోనే కాదు, గ్లామర్‌ పరంగా చూస్తే కాజల్‌, తమన్నా ఇద్దరూ ఇద్దరే. అందుకే ఎంతమంది అప్‌కమింగ్‌ భామలు వస్తున్నా, ఈ ఇద్దరి హవా టాలీవుడ్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కలియికలోనూ రెండు సినిమాల్లో నటిస్తోంది మన క్యూటీ మెహ్రీన్‌.

తమన్నా, మెహ్రీన్‌ కాంబోలో 'ఎఫ్‌ 2' జనవరికి సందడి చేయనుంది. ఇక శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది 'కవచం'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాజల్‌, మెహ్రీన్‌ బెల్లంకొండకు జంటగా నటిస్తున్నారు. అనుభవంతో పోల్చితే మెహ్రీన్‌ కన్నా, కాజల్‌కి ఎంతో అనుభవం ఉంది. ఇటు గ్లామర్‌ని పండించడంలోనూ, అటు పర్‌ఫామెన్స్‌తో కట్టిపాడేయడంలోనూ కూడా. కానీ ఆ రెండింటిలోనూ మెహ్రీన్‌ కూడా నేనేం తక్కువ కాదన్నట్లుగా పోటీ పడుతోందట. ముఖ్యంగా గ్లామర్‌ విషయంలో అస్సలు తగ్గడం లేదట. గత చిత్రాల్లో మెహ్రీన్‌ గ్లామర్‌ చూసేశాం. అయితే ఈ సినిమాలో ఇద్దరికిద్దరూ సూపర్‌ హాట్‌గా కనిపించబోతున్నారట.

గ్లామర్‌ ప్రియులకు పక్కా పైసా వసూల్‌ అనే రేంజ్‌లో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల అందాల ఆరబోతలు చూడబోతున్నామట. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా, ఇద్దరికిద్దరూ విచ్చలవిడిగా అందాల విందు చేసేశారనీ తాజాగా అందుతోన్న సమాచారమ్‌. 'కవచం' సినిమాకి ఈ ఇద్దరు అందగత్తెల హాట్‌ హాట్‌ అందాలు ప్లస్‌ కానున్నాయట. ఆ అందాల విందుకు సమయం ఆసన్నమైందిలే. ఈ నెల 7న 'కవచం' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS