కాజల్‌ కొత్త సినిమా.. డైరెక్టర్‌గా మారిన కొరియోగ్రాఫర్‌.!

By Inkmantra - March 12, 2020 - 11:10 AM IST

మరిన్ని వార్తలు

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసింది. కాజల్‌ పనైపోయిందని అంతా అనుకుంటున్న టైవ్‌ులో, ఆమె బౌన్స్‌ బ్యాక్‌ అవడం చాలాసార్లు జరిగింది. తాజాగా, కాజల్‌ వరుస సినిమాలకు కమిట్‌ అవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్‌-2’ సహా మరో రెండు సినిమాలతో బిజీగా వున్న కాజల్‌, తెలుగులోనూ ఓ రెండు సినిమాలు చేస్తోంది. హిందీలోనూ ఓ సినిమా చేయబోతోంది ఈ అందాల చందమామ. ఇదిలా వుంటే, కాజల్‌ అగర్వాల్‌ ఖాతాలో మరో ప్రాజెక్ట్‌ వచ్చి చేరింది.

 

కొరియోగ్రాఫర్‌ బృందా గోపాల్‌, దర్శకురాలుగా మారి ఓ సినిమా తెరకెక్కించనుండగా, ఈ సినిమా కోసం కాజల్‌ అగర్వాల్‌ని ఫైనలైజ్‌ చేశారు. ఇదొక ఫిమేల్‌ సెంట్రిక్‌ మూవీ అని తెలుస్తోంది. బృందా గోపాల్‌ అంటే, తెలుగుతోపాటు తమిళ, హిందీ సహా అనేక భాషల్లో సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు. స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఎప్పటినుంచో ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనుకుంటోన్న బృందా గోపాల్‌, ఎట్టకేలకు తన డ్రీవ్‌ుని నెరవేర్చుకుంటున్నారు. కాజల్‌తో బృందా గోపాల్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. అదీ కాక, బృందా గోపాల్‌ సిద్ధం చేసుకున్న కథకి కాజల్‌ తప్ప ఇంకెవరూ సూట్‌ అవరట. కాజల్‌ కూడా ఈ సినిమాలో నటించడం పట్ల అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. తనకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్‌ డైరెక్షన్‌లో నటిస్తుండడం ఓ మర్చిపోలేని అనుభూతి అని అంటోందామె. ఈ సినిమా తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS