కాజల్‌కీ అగ్ని పరీక్షే ఇది.!

మరిన్ని వార్తలు

ఈ ఏడాది కాజల్‌కి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. చేసిన రెండు సినిమాలూ నిరాశ పరిచాయి. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌గా తెరకెక్కిన 'అ', తొలి దర్శకుడు తేజ, తొలి హీరో కళ్యాణ్‌రామ్‌తో చాలా గ్యాప్‌ తర్వాత స్క్రీన్‌ పంచుకున్న 'ఎమ్మెల్యే' మూవీలు కాజల్‌కి ఆశించిన విజయాన్ని అందించలేదు. ఇకపోతే తాజాగా కాజల్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో 'కవచం' సినిమాలో నటిస్తోంది. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది 'కవచం'.

ఈ సినిమా విషయంలో ప్రీ రిలీజ్‌ బజ్‌ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నా, కాజల్‌కి 'అ', 'ఎమ్మెల్యే' సినిమాలు నిరాశ పరిచిన దర్మిలా 'కవచం' కాజల్‌కి అగ్ని పరీక్షలాంటిదే. యంగ్‌ హీరోయిన్‌ మెహ్రీన్‌తో కాజల్‌ స్క్రీన్‌ పంచుకుంటోంది. క్యూట్‌గా కనిపించే మెహ్రీన్‌ దగ్గర సీనియర్‌ హీరోయిన్‌ అయిన కాజల్‌ ఎలా కనిపిస్తుందో కానీ, బెల్లకొండతో కెమిస్ట్రీ విషయంలో కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తోంది. రాణి, రాజ్యం, రక్షకుడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇదిలా ఉంటే డైరెక్టర్‌ తేజ, బెల్లంకొండ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో మరో సినిమాలోనూ కాజల్‌ నటిస్తోంది. ఆ సినిమాలో కాజల్‌ది అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రనీ తెలుస్తోంది. తెలుగు సంగతి ఇటుంచితే, తమిళంలో కాజల్‌ నటిస్తున్న 'ప్యారిస్‌ ప్యారిస్‌' చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. బాలీవుడ్‌ క్వీన్‌కి తమిళ రీమేక్‌ ఇది. అన్నింటికీ మించి కాజల్‌కి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంట్‌ అంటే, కమల్‌హాసన్‌తో 'ఇండియన్‌ 2'లో ఛాన్స్‌ దక్కించుకోవడమే. త్వరలో సెట్స్‌ మీదికి వెళ్లనున్న ఈ సినిమాకి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS