ఇటీవలే గౌతమ్ ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన కాజల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు టాక్. తాను తీసుకున్న అడ్వాన్సులు కొన్ని వెనక్కి ఇచ్చేసిందట. అందులో వ్యాపార ప్రకటనలకు సంబంధించినవి ఎక్కువని, ఒకట్రెండు సినిమా కమిట్‌మెంట్స్‌నీ పక్కన పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్యలో కాజల్ నటిస్తోంది. ఇండియన్ 2 అనే సినిమా కూడా ఉంది. విష్ణుతో `మోసగాళ్లు` చేస్తోంది. ఆ సినిమా దాదాపు పూర్తయిపోయింది. `ఇండియన్ 2` అర్థాంతరంగా ఆగిపోవడంతో కాజల్ కాస్త ఇబ్బంది పడుతోంది. అయితే చేతిలో ఉన్న సినిమాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది కాజల్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఆచార్యకు కాజల్ డేట్లు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. `ఇండియన్ 2` విషయమూ ఓ కొలిక్కి వచ్చాక... సినిమాల్లో కొనసాగాలా వద్దా అనే విషయంపై కాజల్ ఆలోచించుకోబోతున్నట్టు సమాచారం. అందుకే కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోలేదని, కొన్ని అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయడానికి కారణం అదే కావొచ్చని తెలుస్తోంది. `లక్ష్మీ కల్యాణం` సినిమాతో 2007లో చిత్రసీమలోకి అడుగు పెట్టింది కాజల్. పదమూడేళ్లలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్సందరితోనూ సినిమాలు చేసింది. బాలీవుడ్లోనూ అడుగు పెట్టి తన ప్రతిభను చాటుకుంది. ఓవిధంగా కాజల్ ఇన్నింగ్స్ సంపూర్ణమైనట్టే. పెళ్లితో - కాజల్ సినిమాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నా - ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెళ్లయ్యాక కాస్త బ్రేక్ తీసుకుని - మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినా - షాకవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే హీరోయిన్లంతా ఇలా చేసినవాళ్లే