మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్.. ఈ ఇద్దరి మధ్యా ఏదో కెమిస్ట్రీ నడుస్తోంది. ఆ కెమిస్ట్రీ చుట్టూనే బిగ్‌బాస్ రియాల్టీ షో నడుస్తోన్నట్లుగా హోస్ట్ నాగార్జున కూడా ‘కవరింగ్’ చేస్తున్నాడు. అసలు కెమిస్ట్రీ తొలుత అబిజీత్ - మోనాల్ మధ్య నడిచింది. దాన్ని ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా మార్చారు బిగ్‌బాస్ నిర్వాహకులు. అందులోంచి అబిజీత్ తప్పుకున్నాడు. చివరికి అఖిల్ - మోనాల్ కెమిస్ట్రీ అందరికీ కనపడేలా చేశారు.
హౌస్‌లో 24 గంటలపాటు జరిగే సన్నివేశాల్ని కేవలం గంట ఎపిసోడ్‌లో చూపిస్తున్నారంటేనే, నిర్వాహకులు తాము ఏం కోరుకుంటున్నదీ కనిపిస్తుంది తప్ప.. అందులో వాస్తవ కోణం కనిపించదన్నమాట. ఇదిలా వుంటే, అఖిల్ సార్ధక్ హౌస్‌లో చేసిందేమీ లేదు ఇప్పటిదాకా. కేవలం మోనాల్ చుట్టూ తిరగడం ద్వారా తన ఉనికిని కాపాడుకుంటున్నాడంతే. సోహెల్, మెహబూబ్‌తో వున్న స్నేహాన్నీ అప్పుడప్పుడూ చెడగొట్టుకుంటూనే వున్నాడు అఖిల్ సార్థక్.
తాజా ఎపిసోడ్‌లోనూ అఖిల్, తాను తప్పు చేసి.. సోహెల్ మీద అరిచి, చివరికి ఏడ్చేసి.. సెంటిమెంటల్ కార్డ్ ప్లే చేశాడు. ఇదంతా బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి అర్థమవుతోంది. దేవి నాగవల్లి కంటే ముందు అఖిల్‌ని పంపించేయాల్సి వుంది.. సుజాతతో పోల్చినా అఖిల్‌కి అంత సీన్ లేదు.. అఖిల్ కంటే కుమార్ సాయి చాలా బెస్ట్.. ఇలా నడుస్తున్నాయి చర్చలు. కానీ, అఖిల్‌తో ఏదో ప్రయోజనం లేకుండా నిర్వాహకులు అతన్ని హౌస్‌లో ఎంటర్‌టైన్ చేయరు కదా.!