సైరా సూపర్ హిట్‌తో.. చిరు రాబోయే 152వ సినిమాపై కూడా ఇప్పటి నుంచే నమ్మకాలు, అంచనాలు మొదలైపోయాయి. పైగా ఈ సినిమా అపజయం ఎరుగని.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఇక కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం. `సైరా` విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న చిరు...ఈ సినిమాని కూడా వీలైనంత త్వరగా మొదలెట్టాలని చూస్తున్నాడు. సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపుగా ఖరారైంది.
హీరోయిన్గా కాజల్ ఫిక్సయినట్టు సమాచారం. ఖైది నెం 150లో కాజల్ కథానాయికగా నటించింది. పైగా మెగా హీరోలకు అచ్చొచ్చిన నాయిక కాజల్. అందుకే కాజల్ పేరు ఖరారు చేసినట్టు సమాచారం. నయనతార, అనుష్క, తమన్నా, శ్రుతిహాసన్.. ఇలా చాలామంది పేర్లు పరిశీలించాక.. కాజల్ కే ఓటేసింది చిత్రబృందం. సో... ఖైదీ జోడీ.. మళ్లీ రెడీ అవుతోందన్నమాట. 2020 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.