తమన్ మంచి జోష్ లో వున్నాడు. ఏం ట్యూన్ చేసిన చార్ట్ బస్టరై కూర్చుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట ఆల్బమ్ కూడా అప్పుటే చార్ట్ బస్టర్ గా నిలిపేశాడు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన కళావతి పాట అందరినీ ఆకట్టుకుంది.
ఇప్పటికే 100 మిల్లియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించిన కళావతి పాట ఇప్పుడు 150 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి ట్రెండింగ్ లో నిలిచింది. వివిధ ఆడియో స్ట్రీమింగ్ యాప్స్ లో టాప్ సాంగ్ లిస్టు లో కొనసాగుతుంది. ఈ పాటలో మహేష్ బాబు సిగ్నేచర్ స్టెప్ అందరినీ ఫ్యాన్ ని అలరించింది. ఇక సినిమా నుంచి వచ్చిన పెన్నీ, టైటిల్ సాంగ్ కూడా మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాయి. త్వరలోనే ఓ భారీ మాస్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. ఈ పాట సినిమాలో మేజర్ హైలెట్ గా వుండబోతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా వుంది.