'ఆచార్య' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి- రామ్ చరణ్ ఇద్దరూ కలసి ఫుల్ లెంత్ రోల్స్ చేసిన ఈ సినిమా కోసం మెగా అభిమానులే యావత్ సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు వున్నాయి. ఇందులో సిద్దా అనే పాత్ర చేశాడు రామ్ చరణ్. మొదట అనుకున్నపుడు ఈ పాత్రలో చరణ్ లేడు. 10 నిమిషాల కామియో రోల్ గా మొదలైన సిద్దా పాత్ర చివరికి పూర్తి నిడివిగా పాత్రగా రూపుదిద్దుకుంది. దీంతో చరణ్ ని రంగంలో దించారు దర్శకుడు కొరటాల శివ. అయితే సిద్దా పాత్రలో చరణ్ కాకుండా మరో నటుడు వుండివుంటే .. ఆ స్థానం ఎవరితో భర్తీ చేస్తే బావుండేది ? ఇదే ప్రశ్న మెగాస్టార్ చిరంజీవికి ఎదురైయింది. ఈ ప్రశ్నకు మెగా అభిమానులు ఆనందం రెట్టింపయ్యేలా సమాధానం ఇచ్చారు చిరు.
'' సిద్దా పాత్రలో చరణ్ చేయడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. మా ఇద్దరి బంధం పాత్రలకు మరింత బలాన్ని తెచ్చిపెట్టాయి. ఈ పాత్రలో చరణ్ లేకపోతే తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే బావుంటుంది. చరణ్ చెయ్యకపోతే పవన్ కళ్యాణ్ తప్పా మరో స్టార్ ని ఊహించలేను. చరణ్ చేసినప్పుడు ఎంత ఆనందం వచ్చిందో .. కళ్యాణ్ బాబు చేసినా అంతే ఆనందం పొందేవాడిని'' అని సమాధానం ఇచ్చారు చిరు. నిజమే .. చిరు చెప్పినట్లు చరణ్ స్థానంలో పవన్ కళ్యాణ్ వున్నా ఆచార్య క్రేజ్ ఇంకా నెక్స్ట్ లెవల్ లో వుండేదనే చెప్పాలి.