కొండపల్లి బొమ్మలతో కల్కి సందడి

మరిన్ని వార్తలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఒక్కటే కల్కి. ప్రభాస్ హీరోగా, నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ సినిమాలకి వేటికి  కల్కి రేంజ్ లో క్రేజ్ లేకపోవటం గమనార్హం. జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. బుజ్జి తో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. బుధవారం ముంబైలో కల్కి టీమ్ మొత్తం ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మరిన్ని అంచనాలను పెంచేసింది. 


ఇప్పడు కొండపల్లి బొమ్మలతో కల్కి సందడి షురూ అయ్యింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మలు ఇపుడు  కల్కి సినిమా రూపాలుతో  దర్శనమివ్వనున్నాయి. కల్కి సినిమాకి ఉన్న బజ్ ని, గుర్తించిన కొండపల్లి కళాకారులు, పిల్లల్ని ఆకర్షించే ఉద్దేశ్యంతో ట్రెండ్ కి అనుగుణంగా కల్కి మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ల రూపాలతో కూడిన  బొమ్మల్ని తయారు చేస్తున్నారు. వీటితో పాటు ప్రభాస్ ఉపయోంచిన కారు బుజ్జి ని కూడా తయారు చేస్తున్నారు. ఈ మేకింగ్ వీడియోని వైజయంతి మూవీస్ సోషల్ మీడియా లో షేర్ చేసింది. 


'కల్కి 2898 ఏడీ‘ సినిమాకు సంబంధించిన కొండపల్లి బొమ్మలని తయారు చేసి స్టోర్స్ లో అందుబాటులో ఉంచారు. కొండపల్లి కళాకారులు అంచనా తప్పు కాలేదు.  వాటికోసం చిన్న పిల్లలు తెగ ఆశపడి ఇష్టంగా కొనుక్కుంటున్నారు. ముందు ముందు కల్కి మానియా ఇంకెంత ఉంటుందో అని పలువు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS