రికార్డ్ స్థాయిలో కల్కి రైట్స్

మరిన్ని వార్తలు

ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా 'కల్కి' కోసం సినీ ప్రియులు ఎప్పటి నుంచో వెయిటింగ్. సలార్ లాంటి సూపర్ హిట్ తరవాత ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ ఇది. మహా నటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే  ప్రభాస్ వసూళ్ల పరంగా టాప్ లో ఉన్నాడు. ఏకంగా వరుస నాలుగు సినిమాలు 100 ల కోట్ల కలక్షన్స్ దాటి ఉన్నాయి. ఫ్లాప్ సినిమాతో కూడా వసూళ్లు రాబట్టే ఘనత ప్రభాస్ కి  ఉంది. ఆది పురుష్ లాంటి భారీ డిజాస్టర్ కూడా వసూళ్లు రాబట్టింది.        


సలార్  హిట్ తో బాక్సాఫీస్ లెక్కలు తారు మారు అయ్యాయి. దీనితో ప్రభాస్ కల్కి సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని టాక్. పైగా ప్రభాస్ కెరీర్ లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కల్కిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సుమారు రూ. 550 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఒక్క నైజాం ఏరియా 62 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఆంధ్రా ఏరియాను నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కింద ఇస్తున్నారని తెలుస్తోంది. ఇంకా ఓవర్సీస్ రైట్స్ కోసం నిర్మాతలు 100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో ఒక తెలుగు హీరోకి ఈ రేంజ్ మార్కెట్ ఉండటం ఇదే మొదటిసారి. రాజమౌళి 'RRR' మూవీ కంటే కల్కి ఎక్కువ మొత్తానికి అమ్ముడు పోతున్నట్టు సమాచారం. 


మహానటి లాంటి సావిత్రి బయోపిక్ తో  నేషనల్ అవార్డు సాధించిన నాగ్ అశ్విన్ ప్రభాస్ కెరియర్ కి బాహుబలి లాంటి హిట్ ఇస్తాడని ఫాన్స్ ఆశిస్తున్నారు. ప్రభాస్ కి  వరల్డ్ వైడ్ ఉన్న మార్కెట్ దృష్ట్యా బయ్యర్స్ కూడా కొనుగోళ్ళకు వెనకాడటం లేదు. కల్కి మూవీలో భారీ క్యాస్టింగ్ కూడా ఉంది. దీపికా పడుకునే, అమితాబ్, కమల్ హాసన్, దిశా పఠాని లాంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. కేవలం ఇండియన్ భాషల్లోనే కాకూండా విదేశీ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కానుండటం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS