RRR లాంటి క్రేజీ సినిమా తరవాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ దేవర. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. దేవర కి ముందు కొరటాల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో ఆచార్య మూవీ తీసి, డిజాస్టర్ చవి చూసాడు. ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా డైరక్టర్ గా మారాడు. ఎలా అయినా హిట్ కొట్టాలని కసిగా వర్క్ చేస్తున్నాడు కొరటాల. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాడు. రెండు భాగాలుగా ఈ మూవీ రానున్నట్లు ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే మొదటి పార్ట్ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్టు సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జాన్వీ చిన్నప్పటి పాత్రలో బన్నీ వారసురాలు అల్లు అర్హ నటిస్తోంది.
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో దేవర ఒకటి. టాలీవుడ్ ఆశలన్నీ దేవర, పుష్ప 2 , కల్కి మీద ఉన్నాయి. ఈ సినిమాలు తప్పకుండా టాలీవుడ్ రేంజ్ ని మరింత పెంచుతాయి అని నమ్మకంగా ఉన్నారు సినీ ప్రియులు. దీనికి తగ్గట్టుగానే ప్రజంట్ దేవర చిత్రం ట్రేడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేయటమే. ఈ మూవీ హిందీ థియేట్రికల్ రైట్స్ కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. కరణ్ సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ దేవరని రిలీజ్ చేయనుంది. తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం ఇంకా పోటీ కొనసాగుతోంది. నిర్మాతలు చాల ఎక్కువ మొత్తం కోట్ చేయటం వలన ఇంకా డీల్ క్లోజ్ అవలేదు. తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీల మధ్య పోటీ నెలకొంది.
ఎన్టీఆర్ ఈ మధ్యనే వార్ 2 షెడ్యూల్ లో పాల్గొనటానికి ముంబై వెళ్లిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ తిరిగి వచ్చాక దేవర తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర అక్టోబర్ 10న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఎన్టీఆర్, కొరటాల కలయిక లో వచ్చిన జంట గ్యారేజ్ సూపర్ సక్సెస్ అయినా సంగతి తెలిసిందే. మళ్ళీ వీరిద్దరూ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.