ఈ యేడాది రిలీజ్ అవ్వబోయే మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్స్ లో... 'కల్కి' ఒకటి. ప్రభాస్ కథానాయకుడిగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలో చాలా విశేషాలే ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ తో పాటుగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి క్రేజీ హీరోలు నటిస్తున్నారు. రాజమౌళి, రాంగోపాల్ వర్మ కూడా గెస్ట్ పాత్రల్లో మెరవబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని మే 9న విడుదల చేద్దామని ఫిక్సయ్యారు. అయితే ఆ డేట్ ఇప్పుడు కాస్త డైలామాలో పడింది. ఈ సినిమా కాస్త ఆలస్యంగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
'కల్కి' వస్తుందన్న ఉద్దేశంతో, మే 9ని ఖాళీగా వదిలేశారు. ఇప్పుడు ఆ డేట్ పై పూరి జగన్నాథ్ గురి పెట్టాడు. ఉస్తాద్ రామ్ కథానాయకుడిగా పూరి దర్శకత్వలో 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మార్చి 8న విడుదల చేద్దామనుకొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతోంది. అందుకే 'కల్కి' రిలీజ్ డేట్ ని ఆక్రమించుకోవాలని పూరి భావిస్తున్నాడు. ఒకవేళ కల్కి అనుకొన్న సమయానికే వస్తే, అప్పుడు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ కూడా మారుతుంది. మే 9న మిస్ అయితే, మే 23న విడుదల చేయాలన్నది ప్లాన్ బిగా కనిపిస్తోంది.