మీడియా ముందు తప్పు చేసిన మెగాస్టార్ అల్లుడు

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ మధ్యనే విజేత చిత్రంతో తెరంగేట్రం చేశాడు, తొలి చిత్రంతోనే హీరోగా పర్వాలేదు అనే ఒక పాజిటివ్ స్టాంప్ అయితే వేయించుకున్నాడు.

అయితే కళ్యాణ్ చేసిన ఒక చిరు తప్పు ఇప్పుడు ఆయనని అందరికీ టార్గెట్ అయ్యేలా చేసింది. అసలేం జరిగిందంటే- మొన్న ఆదివారం రోజు జరిగిన విజేత చిత్రానికి సంబంధించి సక్సెస్ మీట్ జరగగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధి, ప్రెస్ ఇలా అందరూ సరైన సమయానికే రాగా కళ్యాణ్ దేవ్ మాత్రం అసలు టైం కి రాలేదట.

ఇక ఈ కార్యక్రమం నిర్వాహకులు కళ్యాణ్ ని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదట. చాలా సార్లు ప్రయత్నించాక ఆయన ని ఫోన్ లో సంప్రదించగా వేరే పనిలో ఉండి ఫోన్ చూసుకోలేదు అని చెప్పి అప్పుడు కార్యక్రమానికి వచ్చారట.

ఇంతకీ వచ్చాక తన వల్ల ఆలస్యం అయింది అని తెలిసి కూడా ప్రెస్ కి, ఇతర అతిధులకి క్షమాపణ కాని కనీసం వివరణ కూడా ఇవ్వకపోవడాన్ని ఇప్పుడు అందరూ తప్పు పడుతున్నారు. మరి ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్తపడాలని అందరూ సూచిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS