మన్మధున్ని ‘బంగార్రాజు’ ఆదుకోవాలా.?

By Inkmantra - March 11, 2020 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

 నాగార్జున ` కళ్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌ రూపొందించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘మన్మధుడు 2’తో ఆశించిన రిజల్ట్‌ అందుకోలేకపోయాడు నాగార్జున. కానీ, ‘సోగ్గాడు..’ సీక్వెల్‌తో ఖచ్చితంగా హిట్‌ కొట్టాలనుకుంటున్నాడట. అందుకే కళ్యాణ్‌ కృష్ణకు కొన్ని సూచనలు సలహాలు అందించాడట. ఆ రకంగా, డైరెక్టర్‌ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడనీ ఫిలిం నగర్‌ టాక్‌.

 

మొదటి పార్ట్‌లో నాగార్జునే డబుల్‌ రోల్‌ పోషించాడు. కానీ, ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించనున్నాడు. చైతూకి జంటగా సమంత నటించనుందట. అంటే ‘మజిలీ’ తర్వాత చైతూ, సమంత ఆన్‌ స్క్రీన్‌ జత మరోసారి ఫ్యాన్స్‌ని కనువిందు చేయనుందన్న మాట. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్‌ తాజాగా చక్కర్లు కొడుతోంది. తొలి పార్ట్‌లో కన్నా, ఈ పార్ట్‌లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారట. థ్ల్రిల్లర్‌ అంశాల్ని ఇంకాస్త ఎక్కువ జోదించి, తద్వారా సినిమాకి హైప్‌ తీసుకురానున్నారట. ఇకపోతే, ‘సోగ్గాడు..’లో సత్తెమ్మ పాత్ర పోషించిన రమ్యకృష్ణకి ఈ సీక్వెల్‌లోనూ ఇంపార్టెన్స్‌ ఉండనుందట. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS