చిరంజీవి - జగన్ ల మధ్య భేటీ చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీతో పరిశ్రమ కష్టాలు తొలగిపోతాయని అందరి నమ్మకం. అదే జరిగితే ఈ ఇష్యూలో క్రెడిట్ మొత్తం... చిరంజీవికే వెళ్లిపోతుంది. అయితే ఈ భేటీ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ సమావేశం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు దాగి ఉన్నాయని, చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కోసమే జగన్‌ని కలిశారని విమర్శలు మొదలయ్యాయి. చిరుకి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేశాడని కొందరు అంటుంటే, ఇంకొందరు చిరునే రాజ్యసభకి వెళ్తానని రిక్వెస్ట్ చేశాడని చెబుతున్నారు. దాంతో అసలు ఈ సమావేశం పరిశ్రమ కోసమా, స్వ ప్రయోజనాల కోసమా? అనే అనుమానాల్ని రేకెత్తిస్తోంది.
మరోవైపు సీపీఐ నాయకుడు నారాయణ చిరు - జగన్ ల మధ్య భేటీ వెనుక అసలు నిజాలు చెప్పాలని నిలదీయడం మరింత చర్చనీయాంశమైంది. అసలు చిరుని జగన్ పిలవలేదని, చిరునే ఏరి కోరి వెళ్లారని, వీరిద్దరి మధ్య ఏం జరిగిందో జనాలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
చిత్రసీమ అసలే సంక్షోభంలో ఉంది. ఎవరో ఒకరు ముందడుగు వేసి, పరిస్థితిని చక్కబెట్టాల్సిన వేళ ఇది. చిరు ఆ ప్రయత్నమే చేశారు. దానికి రాజకీయాల రంగు పులమడం మాత్రం దారుణం. చిరు నే అప్పాయింట్‌మెంట్ అడిగి వెళ్తే ఏంటి? చిరుని ఆహ్వానిస్తే ఏమిటి? రెండింటి మధ్య పెద్ద తేడా ఏముంటుంది? ఇంతకాలంగా ఎవరు అప్పాయింట్ మెంట్ అడిగినా ఇవ్వని జగన్... చిరుని పిలిచాడు కదా? పరిశ్రమ ఇబ్బందుల గురించిన చర్చ జరిగింది కదా? ఇలా పాజిటీవ్ గా ఆలోచిస్తు ఆగుంటుందన్నది అందరి మాట. పైగా చిరు కేంద్ర మంత్రి గా చేసిన వ్యక్తి. తనకు రాజ్యసభ అవసరమా? చాలా కాలంగా చిరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు కావాలని ఈ కంపు పులుముకుంటాడా? ఇవన్నీ ఆలోచించాల్సిన ప్రశ్నలు.