వ‌రుస‌గా నాలుగు ఫ్లాపుల త‌ర‌వాత‌..!

మరిన్ని వార్తలు

ఈ యేడాది ఎఫ్ 2 త‌ర‌వాత‌... చెప్పుకోద‌గిన స్థాయిలో వ‌సూళ్లు అందుకున్న సినిమా ఏదీ లేదు. అయితే `118` మాత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఓకే అనిపించుకుంది. షేర్‌, ఇజం, ఎం.ఎల్‌.ఏ, నా నువ్వే లాంటి వ‌రుస ఫ్లాపుల త‌ర‌వాత‌... క‌ల్యాణ్ రామ్ కెరీర్‌కి కాస్త జోష్ ఇచ్చిన సినిమా ఇది.  బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా దాదాపుగా 11 కోట్లు తెచ్చుకుంది.

శాటిలైట్‌, డిజిట‌ల్ హ‌క్కులతో క‌లుపుకుంటే.. దాదాపు 18 కోట్ల వ‌ర‌కూ తెచ్చుకుంది. పెట్టుబ‌డితో పోలిస్తే.. 118 లాభాలు తెచ్చుకున్న‌ట్టే.  గుహ‌న్ ద‌ర్శ‌కత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో షాలినీ పాండే, నివేదా థామ‌స్ క‌థానాయికుల‌. నైజంలో ఈ చిత్రం రూ.4 కోట్లు తెచ్చుకుంది. సీడెడ్‌, ఉత్త‌రాంధ్ర‌ల‌లో చెరో 1.20 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా బాగా ఆడుతుంద‌ని భావించారంతా.

కానీ.. అక్క‌డ ఈ చిత్రానికి క‌నీస ఆద‌ర‌ణ కూడా ల‌భించ‌లేదు. ఓవ‌ర్సీస్‌లో కూడా కాస్త నిల‌బ‌డి ఉంటే.. క‌చ్చితంగా నిర్మాత‌కు మ‌రిన్ని లాభాలొచ్చేవి. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ చేయాల‌ని గుహ‌న్ ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS