అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా ప్రకటించి చాలా రోజులైంది. కానీ ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. కనీసం క్లాప్ కూడా కొట్టలేదు. అదెప్పుడు? అని అడిగితే - ఇదిగో - అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. కానీ... ఇంత వరకూ బన్నీ సినిమాకి సంబంధించిన అప్డేట్ లేదు. దాంతో బన్నీ ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు.
బన్నీ సినిమా ఉంటుందా? లేదా? ఉంటే ఎప్పుడు? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటిపై నిర్మాణ సంస్థ హారిక హాసిని స్పందించింది. బన్నీ సినిమాకి సంబంధించిన అప్డేట్ త్వరలోనే ఇస్తామని, తాము కూడా ఈసినిమా గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, ప్రీ ప్రొడక్షన్‌కి సంబంధించిన పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని ట్వీట్ చేసింది.
అందరి మనోహావాల్ని తాము గౌరవిస్తామని, ఈ సినిమా మొదలయ్యే వరకూకాస్త ఓపిక పట్టమని అభిమానుల్ని కోరింది. త్వరలోనే బన్నీ సినిమాకి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అంత వరకూ... ఎదురుచూడాల్సిందే.